News

జయలలితకు తెలంగాణ అసెంబ్లీ నివాళులు


దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తెలంగాణ అసెంబ్లీ నివాళులర్పించింది. సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే జయలలిత మృతిపట్ల స్పీకర్ సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీఎంగా జయలలిత చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. అలాగే ఇటీవల మృతి చెందిన శాసనసభ్యులకు సభ సంతాపం తెలిపింది. అంతుముందుకు వివిధ అంశాలపై టీడీపీ, బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ సభను టీ విరామం నిమిత్తం 15 నిమిషాలు వాయిదా వేశారు.